భూదాన భూమి బాధితులకు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి
______ వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
భూదాన భూమి బాధితులకు అక్కడే డబుల్ బెడ్ రూము లు మంజూరు చేయాలని వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి డిమాండ్ చేశారు. శనివారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు కాకుండా బాధితులకు అక్కడే డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇవ్వాలని , మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. బాధితులకు తమ సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలోఈ సమావేశంలో సరోజినీ , నాగేంద్ర , నాగమణి , రంగమ్మ , సుభద్ర , విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 29








