*
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల వ్యవహారంలో ఇళ్లు కోల్పోయిన పేద బీసీ కుటుంబాల తరఫున ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ & TRP పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న జిల్లా జాయింట్ కలెక్టర్‌కు అధికారికంగా లేఖ అందజేశారు.*
తీన్మార్ మల్లన్న ఖమ్మం రాక తెలిసి కలెక్టర్ విధులకు గైర్హాజరయ్యారని, అందువల్ల జాయింట్ కలెక్టర్‌కు లేఖను స్వయంగా అందజేసినట్లు తెలిపారు.*
బాధితులకు తక్షణమే అదే భూమిలో పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి వెంటనే రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.*
*భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో వేల ఎకరాల భూదాన్ భూములు ఇతరుల ఆక్రమణలో ఉన్నప్పటికీ, పేద బీసీ కుటుంబాల భూములపై కక్షసాధింపు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.*
*ఇళ్లను కూల్చివేసిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా భూములను పట్టాలు చేసి అమ్మిన వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు.*
*అలాగే బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించే వరకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు ప్రకటించాలని సూచించారు.*
*బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.*
*ప్రజల హక్కుల పరిరక్షణలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెనుకడుగు వేయదని ఆయన తెలిపారు.*
*ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు*








