మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో అగ్రనేత ఛత్తీస్ గఢ్ పోలీసులకు లొంగిపోయారు. ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణాలోని హన్మకొండ జిల్లా తరాలపల్లికి చెందిన సాంబయ్య ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు. మహాసముండ్ లోని సరైపాలిలో గల బలోడా అడవుల నుంచి ఓ జర్నలిస్ట్ సంప్రదింపుల సహకారంతో సాంబయ్య టీం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
Post Views: 3








