వెలుగుమట్ల బాధితులకు వెంటనే న్యాయం చేయాలి
కూల్చిన చోటే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి.
-సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
వెలుగు మట్ల భూ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని , కూల్చిన చోటే ప్రభుత్వం బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం పొలిటిలో సభ్యులు
బివి రాఘవులు డిమాండ్ చేశారు. శనివారం ఆయన
ఇళ్లను కూల్చిన వెలుగుమట్ల ప్రాంతాన్ని సందర్శించి , బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలకు పైగా వెలుగుమట్లలో ఇళ్లను నిర్మించుకొని 650 మంది పైగా పేద కుటుంబాలు నివసిస్తున్నారని, వారిని 2000 మంది పైగా పోలీసులు మోహరించి ఖాళీ చేయడం దుర్మార్గమని విమర్శించారు. యుద్ధ వాతావరణ న్ని సృష్టించి కోట్ల రూపాయల ఆస్తిని నష్టం చేసి,ఇంతటి విద్యాసాన్ని ఏ ప్రభుత్వం చేయలేదని తీవ్రంగా ఖండించారు.
ఈ చర్య వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రభుత్వం జిల్లాలోని ముగ్గురు మంత్రులు తెలియజేయాల్సింది అవసరం ఉందని
తెలిపారు. ఈ ప్రాంతంలో భూదాన్ 62 ఎకరాలు ఉందని అనేక సందర్భాల్లో అధికారులు,, మీడియా సంస్థలు ప్రకటిస్తూ వచ్చాయని , ప్రస్తుతం సమస్య
సమస్య 31ఎకరాలలోనిది అని, మిగతా 31 ఎకరాల భూమి సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు? కేవలం ఆసరా లేని పేదల పైన ప్రభుత్వం ప్రతాపం చూపుతూ, రియల్ ఎస్టేట్, వ్యాపారులకు, సంస్థలకు, ప్రయోజనం చేసేలా వ్యవహరించడం దారుణమని ఆయన విమర్శించారు. వారం రోజుల్లో బాధితుల సమస్యను సక్రమంగా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే ఇండియా బ్లాక్ పార్టీ ల దృష్టికి
కూడా తీసుకువెళ్లి జాతీయ స్థాయిలో చర్చ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుదర్శన్ రావు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నాయకులు వై. విక్రమ్ ,బండి రమేష్ , బుగ్గవీటి సరళ మాచర్ల భారతి ఎర్ర శ్రీనివాసరావు మెరుగు సత్యనారాయణ బొంతు రాంబాబు కళ్యాణ వెంకటేశ్వరరావు, బండి పద్మ, పొన్నం వెంకటేశ్వర్లు బండారు రమేష్ దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు








