+91 95819 05907

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు అందించిన ఈ ముగ్గురు వ్యక్తుల మరణం మణుగూరు ప్రజలకు తీరని లోటుగా మారింది.

మణుగూరులో ప్రముఖ మద్యం వ్యాపారిగా గుర్తింపు పొందిన డిఎన్‌సి వెంకన్న గారు (DNC Venkanna) అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. ఇటీవలే ఆయన కుమారుడి వివాహం రెండు రోజుల క్రితమే ఘనంగా నిర్వహించబడగా, ఈ అకస్మాత్తు మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

అలాగే మణుగూరులో గిన్నెల వ్యాపారంతో అందరికీ సుపరిచితులైన బేతంచెర్ల కోటయ్య గారు కూడా కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు బేతంచెర్ల వెంకటేశ్వర్లు మరియు బేతంచెర్ల శ్రీనివాస్ ఉన్నారు. వ్యాపార రంగంలో నిజాయితీతో, సరళ స్వభావంతో కోటయ్య గారు ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

ఇంకా మణుగూరులో జెమినీ జ్యూవెలరీ బంగారు షాపు ఎదురుగా మొదటిసారిగా దంచాయ్ (టీ) ను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తిగా పేరుగాంచిన కొండ్రు సీతారామయ్య గారు కూడా మరణించడం మరో విషాదంగా మారింది. మణుగూరు ప్రజలకు ప్రత్యేకమైన దంచాయ్ రుచిని పరిచయం చేసి మంచి గుర్తింపు పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు అశోక్, గౌతమ్, కిరణ్ ఉన్నారు.

మణుగూరులో వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ముగ్గురు వ్యక్తుల మరణం పట్టణ ప్రజలను, వ్యాపార వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి సేవలను, స్నేహపూర్వక స్వభావాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పలువురు పేర్కొన్నారు.

మణుగూరు ప్రజలు, వ్యాపారస్తులు ఈ ముగ్గురు ప్రముఖుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

 Don't Miss this News !