అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం!
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు శనివారం అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించి ఆపదలో ఉన్న కుటుంబాలకు అభయమిచ్చారు. తొలుత గుమ్మడివల్లి గ్రామంలో నాయకులతో ఆత్మీయంగా భేటీ అయి భవిష్యత్ రాజకీయాలపై దిశానిర్దేశం చేసిన ఆయన, అనంతరం కోయరంగాపురం గ్రామంలో అగ్నిప్రమాదానికి గురై ఇల్లు కోల్పోయిన కారం మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, తక్షణమే ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు; అలాగే అధికారులతో మాట్లాడి బాధితులకు కొత్త ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా నారాయణపురంలో అనారోగ్యంతో మృతిచెందిన బోడపాటి వెంకటమ్మ కుమార్తె కుటుంబాన్ని, మరియు బీఆర్ఎస్ నాయకుడు జక్కుల రాంబాబు మాతృమూర్తి స్వర్గీయ నాగమణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కోయరంగాపురం సర్పంచ్ సోడెం చిన్ని గంగమ్మ, ఉప సర్పంచ్ మడివి లక్ష్మణ్, వార్డ్ మెంబర్లు సెట్టిపల్లి కృష్ణారెడ్డి, ముత్తమ్మలతో పాటు నాయకులు చందా లక్ష్మీనర్సయ్య, మిండ దుర్గారావు, చిచ్చోడు సీతారాములు, కుర్సం వెంకటేశ్వరరావు, షేక్ అమీర్, పుట్ట సత్యం, చిమడబోయిన వెంకటేశ్వరరావు, సాయిల సత్యనారాయణ, శ్రీను, ముత్యాల రావు, హుస్సేన్, పోలిన నాగేశ్వరరావు, శంకర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.








