*పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కంటోన్మెంట్ ప్రజలు
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. ఆమె అంతక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మారేడ్పల్లి హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు పాడె మోశారు. లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, భారాస అధినేత కేసీఆర్ నివాళులర్పించారు.
Post Views: 704