నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏఐసిసి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఆయన హైదరాబాదులో సోమవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పై పూర్తి నమ్మకం ఉందని తప్పక తనకి ఎంపీ టికెట్ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. నాకేమైందని నన్ను పక్కకు పెట్టారని ఆవేదన వెలుబుచ్చారు. కొత్త లీడర్లకు పార్టీ టికెట్ ఇచ్చుకుంటూ పోతే పాత లీడర్ల మా పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు.కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరతానంటూ బల్ల గుద్ది చెప్తున్నారు. చివరిసారి కూడా తనకు అన్యాయమే జరిగిందని.. ఈసారి అలా జరగదన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పుడే ఎవరి గళం వారు ఇప్పుతున్నారు.
