అక్రమ ఇసుక తొలకాలకు పాల్పడితే కఠిన చర్యలు
*త్వరలో మన ఇసుక వాహనం
*మైనింగ్, గ్రౌండ్ వాటర్ , పోలీస్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్
డా.ప్రియాంక అల4
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాగులు, కిన్నెరసాని నది పై ఇసుక రిచ్ ల ఏర్పాటు చేసేందుకు మైనింగ్, గ్రౌండ్ వాటర్ , పోలీస్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక అలా సోమవారం కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ ముఖ్యంగా
అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్,రెవెన్యూ అధికారులు సమన్వయంగా అక్రమ ఇసుక కార్యకలాపాలు అరికట్టేందుకు చేపట్టవలసిన చర్యలను సూచించారు .మన ఇసుక వాహనం లో భాగంగా వాగులు కిన్నెరసాని నదుల పై ఇసుక రీచ్ ల ఏర్పాటు చేయాలని దాని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
