నేటి గద్దర్ న్యూస్ ,హైదరాబాద్:
ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక ఏక్సిడెంటల్ సీఎం.
రోజా ఐటెం రాణి, పులుసు పాప… అంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
జగన్ ఒక ఏక్సిడెంటల్ సీఎం. నాన్న చనిపోతే సీఎం అయ్యాడు
రోజా ఐటెం రాణి, పులుసు పాప…. అంటూ నిర్మాత బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు మాజీ సీఎం పాలన ను దుయ్యబడుతూనే…. ఆంధ్ర పాలకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీసీఎం కేసీఆర్ ను అడ్డుపెట్టుకొని రాజకీయాలకు వచ్చారని ఎద్దేవ చేశారు. మేడిగడ్డకు మరమ్మత్తులు నిర్వహిస్తే మళ్లీ తెగిపోదని బీఆర్ఎస్ నాయకులు గ్యారెంటీ ఇస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని ఇప్పటికే రెండు హామీలు అమలులో ఉన్నాయని మరో రెండు ఈరోజు సాయంత్రం ప్రారంభించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని అడ్డుపెట్టుకొని సీఎం కాలేదని ఆయన పోరాట యోధుడు అని కితాబిచ్చారు ఇండియాలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నాని సీఎం రేవంత్ రెడ్డి పై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు
