నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
మల్లారెడ్డి మాట్లాడుతుండగా పవర్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.
నాగారం దమ్మాయిగూడలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ పోయింది.. అదే సమయంలో దమ్మాయిగూడ దగ్గర డీఈ భాస్కర్ రావు, సర్కిల్ ఎస్ఈ అనుమతి లేకుండా ఎల్సీ ఇచ్చాడు.
దీంతో ఆ రోజు ఉదయం 10:05 నుండి 10:35 వరకు అర్ధగంట విద్యుత్ ఆగిపోయింది.. దీనిపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎల్సీ తీసుకోవడంపై కీసర డీఈ భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు, నాగారం ఏఈఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని TSSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు
Post Views: 263