ములకలపల్లి. నేటి గద్దర్ న్యూస్. మే 05.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దమ్మపేట సిపిఐ ఉద్యమ నిర్మాత స్వర్గీయ కామ్రేడ్ యార్లగడ్డ భాస్కర్ రావు సంతాప సభ ములకలపల్లి లో ఏఐటీయూసీ కార్యాలయం లో ఎంపీటీసీ కొర్రీ భద్రం అద్యక్షతన నిర్వహించారు. ఈ సభ లో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ యార్లగడ్డ భాస్కర్ రావు సిపిఐ పార్టీ లో చిన్న తనం నుండే ఎర్ర జెండా ఎత్తుకున్నారని పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి పార్టీ శాఖలు , గ్రామాలు , సభ్యులు పెంచేఅందుకు కృషి చేశారని ఎంతో మంది కి ఇండ్ల స్థలాలు , భూమి పోరాటాలు ద్వారా అందించిన నాయకుడని కొనియాడారు , భాస్కర రావు అకాల మరణం సిపిఐ పార్టీకి కి తీవ్ర నష్టం అని సిపిఐ పార్టీ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండ దండలు ఇస్తుందని భాస్కర్ రావు ప్రతి పేద వాడి హృదయాల్లో చీర స్థాయి గా ఉంటారని అన్నారు , ఈ సమావేశం లో సిపిఐ మండల కార్యదర్శి ఎండి యూసుఫ్ , ఎంపీటీసీ కొర్రీ భద్రం , ఎస్ కె జబ్బార్ , బానోత్ హర్యా , వీరు నాయక్ , పూనెం రాంచందర్ , ముల్లంగి వీర్ భద్ర రెడ్డి ,అనుముల సాయి ,గంట శాల సంతోష్ , సడియం నాగరాజు , పాయం బాబురావు , కట్టం నగేష్ , కృష్ణ , తదితరులు పాల్గొన్నారు.
