★ఇంటర్ మీడియట్ ఫలితల్లో మెరిసిన గిరి పుత్రిక.
★ITDA ఉన్నత చదువుకు ఆర్థిక సహాయం చేయాలి
★డాక్టర్ ని అవుతా:గడ్డం అమృత వర్షిణి
ములకలపల్లి.నేటి గద్దర్ న్యూస్(మే 05):విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ భవిష్యత్తుకు పునాది లాంటిది అంటారు. ఈ పునాది ఎంత దృఢంగా నిర్మించుకుంటే భవిష్యత్తు అంతా బాగుంటుందని గురువులు, పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కోవ లోకి వస్తుంది మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో చదివిన గడ్డం అమృత వర్షిణి ఇంటర్ ఫలితలలో కాలేజీ టాపర్‌గా నిలిచింది.ఈ మార్కులు సాధించడంలో తన కృషి ఎలా ఉందనే విషయం పై నేటి గద్ధర్ ఆమెను పలకరించింది.ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితల్లో ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో లో బై.పి.సి. గ్రూప్ లో చదివిన గడ్డం అమృత వర్షిణి తండ్రి వసంతరావు కుమార్తె 1000/929 మార్కులు సాధించి కళాశాల టాప్పర్ గా నిలిచాను.ఈ రెండు సంవత్సరాల కస్టపడి చదివితే భవిష్యత్తు బాగుంటుందన్నారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి992 మార్కులు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.పరీక్షలు రాసిన సమయంలో నేను ఎక్కువగానే స్కోర్ చేస్తాను అనుకున్నానన్నారు.ఈ మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. డాక్టర్ కావాలన్నదే తన జీవిత ఆశయమని ITDA , దాతలు ,ప్రభుత్వం సహకరిస్తే మెరుగైన కోచింగ్ తీసుకుని డాక్టర్ సీటు సాధిస్తానని ఆమె తెలిపారు. ఒక గిరిజన యువతీ ప్రభుత్వ కళాశాల్లో చదువుకొని కళాశాల టాపర్ గా నిలవడంతో చంద్రుకుంట గ్రామస్తులు, పలువురు గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గడ్డం అమృత వర్షిణి చేరుకోవాలని ఆకాంక్షించారు.
