★రెండు దుకాణల్లో చోరీ
★విచారణ చేపట్టిన SI
*బోనకల్, నేటి గద్ధర్ న్యూస్ :* బోనకల్ లో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు రెండు దుకాణల్లో చోరీకి పాల్పడ్డారు. మండల కేంద్రమైన బోనకల్ లోని ఖమ్మం బస్టాండ్ సెంటర్ లో ఉన్న రెండు దుకాణల్లో గుర్తు తెలియని ఆగంతకులు శనివారం అర్ధరాత్రి రాజు పాల విక్రయ కేంద్రం, శ్రీ ప్రసన్న బండ్లమాంబ ఫుట్ వేర్ అండ్ ఫ్యాన్సీ షాపుల్లో వెనుక వైపు నుండి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. రాజు పాల విక్రయ కేంద్రంలో రూ. 20,000 ల నగదు, ప్రక్కనే వున్న ఫ్యాన్సీ కంగన్ హాల్ రూ. 5000 ల నగదుతో చోరీకి పాల్పడ్డారు. ఫ్యాన్సీ దుకాణంలో నగదు తో పాటు రూ. 54,000 ల విలువైన చేసే సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం చోరీ విషయాన్ని గమనిం చిన రెండు దుకాణల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఖమ్మం సిసిఎస్ సిఐ బాలాజీ, స్థానిక ఎస్సై మధుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని షాపు నిర్వాహకుల ద్వారా చోరికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చోరికి గురైన దుకాణ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని బోనకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.