నేటి గద్దర్, మే 05, భద్రాద్రి కొత్తగూడెం :
కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ సారపాక గ్రామంలో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గ్రామంలో జరుగుతున్న సంత వద్ద సిపిఐ, సిపిఎం, టిడిపి, టీజేఎస్ బలపర్చిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ నీ హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సారపాక గ్రామంలోని వివిధ కాలనీ నుండి వచ్చిన ఓటర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేయనున్న కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, సిపిఐ నాయకులు పేరాల శ్రీనివాస్, సిపిఎం నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, తదితర కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, టీజేఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది.