నేటి గధర్, మే 5, డెస్క్ :
గ్రేటర్ హైదరాబాద్ లో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి బట్టి విక్రమార్క X (ట్విట్టర్లో) పేర్కొన్నారు. శనివారం నాడు తొంభై (90.68 MU) మిలియన్ యూనిట్లు దాటి విద్యుత్ ను హైదరాబాదులోని ప్రజలు వినియోగించినట్లు పేర్కొన్నారు. 2023 లో ఇదే రోజు 59.98 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడకం జరిగిందని, ఈ ఏడు దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ ను ప్రజల వినియోగించారని వెల్లడించారు. ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేనుందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని ట్విట్ ద్వారా ప్రజలకు తెలిపారు.
Post Views: 105