నేటి గద్ధర్ వెబ్ డెస్క్: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్ లోని నంది నగర్ జీహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.KTR సతీమణి నీలిమ, కుమారుడు హిమాన్షు రావు లు సైతం తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైందన్నారు. ప్రజల తలరాతను మార్చేది ఓటు హక్కు అని అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Post Views: 38