– ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశాం
– జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
నేటి గద్దర్, మే 13, భద్రాద్రి కొత్తగూడెం :
కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 49.31% ఓటింగ్ పోలైనట్లు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1:00 గంటలకు 49.31 శాతం పోలింగ్ నమోదైనట్లు మెహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో పినపాక 49.82%, భద్రాచలం 49.54%,ఇల్లందు 47.58%, ఖమ్మం పార్లమెంటు పరిధిలో కొత్తగూడెం 47.60%, అశ్వరావుపేట 53.63% నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని, ఓటు హక్కు వినియోగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
Post Views: 90