+91 95819 05907

పినపాక నియోజకవర్గంలో సజావుగా పోలింగ్ ప్రక్రియ

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మహబూబాబాద్ (S T) PC పినపాక నియోజకవర్గం లోని పార్లమెంటు ఎన్నికల ఓటర్ ప్రక్రియ సెక్టర్ల వారీగా అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగిందని 65. 91% ఓట్లు పోలయ్యాయని, 110-పినపాక (ST) నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి/ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.సోమవారం నాడు మణుగూరు లోని మండల పరిషత్ జూనియర్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ పూర్తికాగానే పోలింగ్ సామాగ్రి తీసుకొని వచ్చిన పోలింగ్ సిబ్బంది నుండి తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు మణుగూరు తాసిల్దార్ కార్యాలయం నుండి ఉదయం 5:30 గంటలకు ఏజెంట్లు సమక్షంలో మాక్ పోల్ నిర్వహించి , 7 గంటలకు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ ను జిల్లా పోలింగ్ అధికారికి పంపించడం జరిగిందని అన్నారు. మారుమూల మండలాలైన గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం సెక్టార్లకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల పోలింగ్ ప్రక్రియ ముగియగానే ప్రత్యేక పోలీస్, సిఆర్పిఎఫ్ బలగాల సెక్యూరిటీతో పోలింగ్ సామాగ్రిని ముందుగా తెప్పించుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి సెక్టార్ రూటులవారీగా పోలింగ్ స్టేషన్లను బట్టి సిబ్బందిని చేరవేయడానికి రెండు బస్సుల చొప్పున కేటాయించి, 250 పోలింగ్ స్టేషన్లకు గాను 30 మంది సెక్టర్ అధికారులు, 60 మంది మైక్రో అబ్జర్వర్లు ,ప్రతి పోలింగ్ స్టేషన్కు పిఓలు, ఏపీవోలు, ఓపిఓలు మరియు రిజర్వుగా పోలింగ్ సిబ్బందిని కూడా పంపడం జరిగిందని అన్నారు. అదేవిధంగా సెక్టార్ల వారీగా తిరిగి పోలింగ్ సిబ్బందిని తీసుకొని రావడం జరిగిందని అన్నారు. ఎన్నికల విధులకు వెళ్లే పోలింగ్ స్టేషన్లకు ఎండాకాలం ను దృష్టిలో పెట్టుకొని గ్లూకోస్ డిపాకెట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో కరెంటు, మంచినీటి సౌకర్యంతో పాటు సమయానికి టి, టిఫిన్ భోజనాలు పోలింగ్ స్టేషనులకు సరఫరా చేయడం జరిగిందని, పోలింగ్ స్టేషన్ల వారీగా నియమించబడ్డ సెక్టర్ అధికారులు వారి రూటులవారీగా పోలింగ్ సిబ్బందిని తీసుకొని రావడం జరిగిందని,సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ అయిపోయే సమయంలో ఓటర్లు ఓటర్లు కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయడానికి లైన్ లో ఉండడంతో వారికి ప్రత్యేకంగా తయారు చేసిన స్లిప్పులను అందించి ఓటింగ్ ప్రక్రియ అయిపోగానే సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకొని భద్రత నడుమ సిబ్బందిని తీసుకొని రావడం జరిగిందని, పినపాక నియోజకవర్గం లో 14 పోలింగ్ స్టేషన్లలో సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేని చోట, ప్రతి రెండు గంటలకు ఒకసారి అన్ని పోలింగ్ స్టేషన్లల నుండి సంబంధిత సెక్టరల్ అధికారులు పురుషులు, స్త్రీలు వేరువేరుగా పోలింగ్ సరళి
నీ ఏ ఆర్ ఓ కే తెలియజేయడం జరిగిందని అన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేని పోలింగ్ స్టేషన్ల నుండి ప్రత్యేకంగా సరఫరా చేసిన యాపుల ద్వారా పోలింగ్ సరళి తెలియ చేశారని ఆయన అన్నారు. సెక్టరల్ అధికారుల నుండి మొదలుకొని పి ఓ లు, ఏపీవోలు ,ఓపిఓలు మరియు పోలింగ్ స్టేషన్లో వివిధ పనులకు నియమించిన సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉండి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా కృషి చేశారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాఘవరెడ్డి ,నయాబ్ తాసిల్దార్ ఎలక్షన్ నాగరాజు, ఐ టి డి ఏ అధికారులు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ , డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్,ఎ సి ఎం ఓ రమణయ్య ఏ టి డి ఓ నరసింహారావు జేడీఎం హరికృష్ణ ,బూర్గంపాడు తాసిల్దార్ ముజాహిద్, ఐటిడిఏ రెవెన్యూ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !