నేటి గద్దర్, మే 13, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బూర్గంపాడు మండలంలోని 57 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి . మండల వ్యాప్తంగా మొత్తం 49813 మంది ఓటర్లు కు గాను మహిళలు పురుషులతో కలిపి 30809 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మండల వ్యాప్తంగా 61.85 శాతం నమోదు అయింది . కాగా అత్యధిక పోలింగ్ శాతం 241 పోలింగ్ కేంద్రంలో 88.07 శాతం నమోదు కాగా అత్యాల్పంగా 200 పోలింగ్ కేంద్రం వద్ద 21. 79 శాతం నమోదయింది .ఉదయం7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసేందుకు సమయం ఉండడంతో నాలుగు గంటల తరువాత పలు పోలింగ్ కేంద్రాల్లో పదుల సంఖ్యలో ఓటర్లు వేచి ఉన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగు గంటల సమయం ముగిసిన తర్వాత ఓటర్లు ఓటు వేసేందుకు రావడంతో అధికారులు సమయం అయిపోయినది అని చెప్పడంతో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత ఓటర్లు రావడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. ప్రొసీడింగ్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పిఓపిఓ తోపాటు ముగ్గురు ఓపివోలు సిబ్బంది పాల్గొన్నారు .వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్లు సహాయంతో తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండటంతో . జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై సుమన్ అదనపు ఎస్సై నాగబిక్షం ల ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదన బలగాలను ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మండల కేంద్రంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య స్వల్ప గర్షణ చోటుచేసుకుంది పోలీసులు కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది .144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఉదయం నుంచి అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు జరిగినప్పటికీ మండల వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ లో ఓటర్లు పాల్గొన్నారు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.