★ ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు
★ పోలీసు శాఖ దృష్టి సారించాలి
నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి,మణుగూరు: బొగ్గు టిప్పర్ల నిర్వాహకం మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేటి గద్దర్ న్యూస్. పినపాక, మణుగూరు మండలాల సరిహద్దు మండలాలలో BTPS థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు . ఈ కేంద్రానికి మణుగూరు బొగ్గు గనుల నుండి రోడ్డు మార్గాన టిప్పర్ల ద్వారా బొగ్గును తరలించడం జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా…. మాకు అడ్డు ఎవరూ లేరు అనే చందంగా ఇస్టారీతిన…. బి టి పి ఎస్ ప్రధాన గేటు సమీపంగా ప్రధాన రహదారిపై బొగ్గు లోడు టిప్పర్లను నిలుపుతున్నారు. దీనితో ట్రాఫిక్ జామ్ కావడంతోపాటు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ నియమావళిని ఉల్లంఘిస్తున్న బొగ్గు టిప్పర్లపై పోలీస్ శాఖ కొరడా జులుపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బొగ్గు టిప్పర్ల మూలంగా గత కొన్ని సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న టిప్పర్ డ్రైవర్ల లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇకనైనా బీటీపీఎస్ యాజమాన్యం, పోలీస్ శాఖ ,RTA అధికారులు దృష్టి సారించి… బొగ్గు టిప్పర్ల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.