★ యూట్యూబ్ ఛానల్ ను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడిన Congrees పార్టీ Mlc అభ్యర్థి మల్లన్న
★ రైతుబంధు పడలేదని అడిగినందుకు రైతులను చెప్పుతో కొడతా అన్న మల్లన్న
★ నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?
★ నిరుద్యోగ భృతి ఏది?
★ మెగా డీఎస్సీ ఏది?
★ ఉద్యోగస్తులకు పెంచిన డిఎ ఎంత?
★ అక్రమాల పుట్ట తీన్మార్ మల్లన్న
★ 70 రోజులు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించిన విషయం వాస్తవం కాదా?
★ సౌమ్యుడు, రైతు బిడ్డ, వివాద రహితుడు , సామాజిక సేవలో దిట్ట నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
★ రూ కోట్ల వార్షిక వేతనాన్ని వదులుకొని అగ్రరాజ్యం నుండి ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి
★ ఆశయం కావాలా? అహంకారం కావాలా?
★ తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది ఈ యుద్ధం
★ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు లు ఒక ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ ని 9సార్లు కలవాలి
★ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
565 కేసులు ఉన్న తీన్మార్ మల్లన్న కావాలా? Bits Pilani విద్యావంతుడు కావాలా? తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులు మేధావులు, ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలని BRS రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సబండ వర్గాలను భయభ్రాంతులకు గురిచేసి ఏ విధంగా డబ్బులు దండుకున్నాడో వివరిస్తూ… ఆరు నెలల కాంగ్రెస్ పాలనను సైతం దుయ్యబట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగం సభికులను ఆలోచింపజేసింది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిన ప్రతిసారి నిరుద్యోగుల నుండి భారీ స్పందన లభించింది . తెలంగాణ రాష్ట్రం తన ఉనికి కోసం మరో యుద్ధం ప్రారంభించిందని… తెలంగాణ శ్రేణులు ఈ యుద్ధంలో పాల్గొని బీ ఆర్ ఎస్ కి మద్దతు తెలపాలన్నారు.యూట్యూబ్ ఛానల్ ను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడిన Congrees పార్టీ Mlc అభ్యర్థి మల్లన్న
రైతుబంధు పడలేదని అడిగినందుకు రైతులను చెప్పుతో కొడతా అన్న విషయం యావత్ తెలంగాణ సమాజం రైతన్నలు మరవకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏది? మెగా డీఎస్సీ ఏది? ఉద్యోగస్తులకు పెంచిన డిఎ ఎంత? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్రమాల పుట్ట తీన్మార్ మల్లన్న. 70 రోజులు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించిన విషయం వాస్తవం కాదా? అన్నారు. వాస్తవాలను ప్రచారం చేయడం … ముఖ్యంగా తెలంగాణ మహాత్ముడు కెసిఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పబ్బం గడిపాడే తప్ప… ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. సౌమ్యుడు, రైతు బిడ్డ, వివాద రహితుడు , సామాజిక సేవలో దిట్ట నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. రూ కోట్ల వార్షిక వేతనాన్ని వదులుకొని అగ్రరాజ్యం నుండి ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి అని అన్నారు. ఆశయం కావాలా? అహంకారం కావాలా?. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది ఈ యుద్ధం. బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు లు ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ ని 9సార్లు కలవాలి అని సూచించారు. రాకేష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.