– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి
నేటి గదర్, మే 21, భద్రాద్రి కొత్తగూడెం / బూర్గంపాడు :
దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండలం అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దుగ్గెంపూడి మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత రాజీవ్ గాంధీ కి చెందుతుందన్నారు. దేశంలో బీదరికాన్ని పారదోలిన నాయకుడని, భారతదేశం సాంకేతిక విప్లవానికి ఆధ్యులు నవభారత నిర్మాణ సారధి రాజీవ్ అని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలను భారతదేశానికి పరిచయం చేసిన భవిష్యత్తుకు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ను భారతదేశానికి తీసుకువచ్చి దేశ అభివృద్ధికి బాటలు వేసిన అపర మేధావి అని, భావితరాలకు పూజ్యులు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిన దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన త్యాగధనులు భారతరత్న దివంగత నేత భారతదేశ మాజీ ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మాజీ సొసైటీ చైర్మన్ పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మైముద్ ఖాన్, పినపాక నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగువ రమేష్, కాంగ్రెస్ నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, బూర్గంపాడు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.