★ములుగుZP ఛైర్పర్సన్, నియోజకవర్గ ఇంచార్జి. బడే నాగజ్యోతి
నేటి గద్ధర్ న్యూస్,ములుగు:
ములుగు నియోజకవర్గ BRS పార్టీ ముఖ్య నాయకులు పట్టభద్ర ఓటర్ల సమావేశం ములుగు నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ నెల 22న బుధవారంఉదయం 10గంటలకు నిర్వహించడం జరుగుతుంది అని ములుగుZP ఛైర్పర్సన్, నియోజకవర్గ ఇంచార్జి. బడే నాగజ్యోతి తెలిపారు. ఆమె మంగళవారం ములుగు లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హాజరు కానున్నారని తెలిపారు. ములుగు జిల్లా, నియోజకవర్గంలోని BRS పార్టీ MPPలు,ZPTC లు, MPTCలు,సర్పంచులు,మండల అధ్యక్షులు,గ్రామాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు,యువకులు, మహిళలు,పట్టభద్ర ఓటర్లు అందరూ తప్పకుండా ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై మన KTR పర్యటనను విజయవంతం చేయాలని ఆమె కోరారు.