+91 95819 05907

రేగుబల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ గుట్ట తవ్వకాలను రెవెన్యు వారు నిలిపివేయాలి: కొండా చరణ్

◆ ప్రజల అవసరాలకు తట్టెడు గ్రావెలుకు సైతం అనుమతి ఇవ్వని రెవెన్యు వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు

◆ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు తగ్గొడుతూ ఇసుక ర్యాంపులోకి రోడ్డు వెయ్యడం కోసం దొడ్డి దారిన గ్రావలను తరలిస్తున్న ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లపై రెవెన్యూ వారికి ఎందుకు ఇంత ప్రేమ?

◆అనుమతులు లెకుండా గుట్ట తవ్వకాలు జరుపుతున్న (భారీ యంత్రాలైన) JCB ను తోలకాలు జరుపుతున్న లారీలను వెంటనే సీజ్ చెయ్యాలి

◆సంబంధిత అక్రమార్కులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలి లేకుంటే ఉద్యమిస్తాం

◆ CPIML మాస్ లైన్ ప్రజా పంధా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(దుమ్ముగూడెం):

దుమ్ముగూడెం మండలం లోని WL రేగుబల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ గుట్ట తవ్వకాలను రెవెన్యు వారు జోక్యం చేసుకొని నిలిపివేయాలని cpiml మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ ఆద్వర్యంలో దుమ్ముగూడెం మండల రెవెన్యూ కార్యాలయం అధికారికి RI ఆదినారాయణ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ రేగుపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ గుట్టని కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలైన జెసిబి లతో తవ్వకాలు జరుపుతూ లారీలతో ఇసుక ర్యాంపు లోకి రోడ్డు వేయడానికి వంద లాది ట్రిప్పులు తోలుతున్నారు ఇప్పటికే నాలుగు రోజులుగా ఇది కొనసాగుతుంది ఇది ఇట్లాగే కొనసాగితే ఆ గ్రామం ప్రజలకు భవిష్యత్ లో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే గ్రామంలో ఉన్న పశువులు మేత కోసం, స్మశాన వాటిక కోసం కాల కాల క్రమేణా పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల స్థలాల కోసం తదితర అవసరాలకు ఈ గుట్టనే ఇక్కడి ప్రజలు వుపయోగిస్తారు కాబట్టి ప్రజల అవసరాలను, బలహీనతలను అడ్డం పెట్టుకొని ప్రజా సంపద అయిన గ్రావెల్ ను కొందరు లూఠీ చేస్తున్నారని అన్నారు గ్రామస్తులు అవసరాల కోసం తట్టెడు గ్రావెల్ తీసుకుపోయిన అడ్డుపడే రెవిన్యూ అధికారులకి ఇక్కడ జరుగుతున్న లూఠీ కనబడడం లేదా అని ప్రశ్నించారు గ్రావెల్ మట్టి ఇసుక ఒక్క ట్రక్కు సైతం అక్రమంగా తరలిస్తే ఆ వాహనాల పైన ఆ వ్యక్తుల పైన కేసులు పెట్టే రెవిన్యూ వారు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు అక్రమార్కుల పట్ల ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్ల పట్ల రెవెన్యు వారు ఎందుకింత మెతక వైఖరి వహిస్తున్నారని విమర్శించారు తక్షణమే అనుమతులు లెకుండా జరుగుతున్న గుట్ట తవ్వకాలను,గ్రావెల్ అక్రమ రవాణా అని నిలిపివేయాలని, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ గుట్టని రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలను తొలకాలు జరుపుతున్నా భారీ యంత్రాలైన జెసిబి లను లారీలను తక్షణమే సీజ్ చేయాలని సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమం తప్పదని హెచ్చరించారు
ఈకార్య్రమంలో పార్టీ దుమ్ముగూడెం మండలం కార్యదర్శి దాసరి సాయన్న పార్టీ నాయకులు బాబురావు,భాస్కర్, ప్రవీణ్ తదితులు పాల్గొన్నాను

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !