నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 25:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు జిల్లా ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఘనంగా సత్కరించారు.జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో పని చేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది పిల్లలు 35 మంది విద్యార్థినీ, విద్యార్థులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులను అభ్యసించి మంచి ర్యాంకులను సాధించి తమ తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్బంగా ఎస్పీ సూచించారు.పోలీస్ శాఖలో అహర్నిశలు ఎంతో కష్టపడి విధులు నిర్వర్తిస్తున్న తమ తల్లీదండ్రుల కలలను సాకారం చేయాలని తెలిపారు.జీవితంలో నీతి,నిజాయితీ పట్టుదలతో సాధిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని తెలియజేసారు.ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదివే దశలోనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు.ఈ దశలో కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకొని తల్లిదండ్రులు గర్వపడేలా నడుచుకోవాలని సూచించారు.పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన తాను కూడా తన తల్లీదండ్రుల కష్టం,కృషి వల్లనే కష్టపడి చదివానని తెలియజేసారు.ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరే వరకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెరిట్ సాధించిన పోలీస్ కుటుంబాల పిల్లలకు వారి తల్లీదండ్రుల సమక్షంలో ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎంటిఓ సుధాకర్,ఆర్ఐ హోమ్ గార్డ్స్ నరసింహరావు,ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.