ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి…
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు: గడ్డం స్వామి.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాచలం మే 25:
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని,ఉపాధి పని చేస్తున్న కూలీలకు కనీసం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భద్రాచలం పట్టణ శివారులో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి పర్యటించారు.శ్రమకు తగ్గ ఫలితం రావడంలేదని, మండుటెండలో పనిచేసిన రోజు కూలి 90 రూపాయల లోపు పడుతుందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి పని ప్రదేశంలో టెంట్లు, మంచినీరు మొదలగు సౌకర్యాలు అందుబాటులో లేవని కూలీలు వాపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ ఉపాధి పథకం ఎవరి దయాదాక్షిన్యాల వల్ల రాలేదని 2004లో వామపక్షాలు నిర్వహించిన పోరాటాలు, పార్లమెంటులో వారి కృషి ఫలితంగా ఉపాధి చట్టం వచ్చిందని దీనిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు.ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు సరైనా వేతనాలు రాకపోవడం దారుణమని అన్నారు.ఉపాధి పని ప్రదేశాలలో టెంట్లు, మంచినీరు సౌకర్యాలు ఉండాలని చట్టంలో చెబుతున్న అవి అమలు జరగకపోవడం అన్యాయమని అన్నారు.ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని,కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలి 600 వందల రూపాయలు ఇవ్వాలని,పని ప్రదేశాలలో మంచినీరు టెంట్లు మొదలగు సౌకర్యాలు కల్పించాలని పలుగు,పారా పదునుకు ప్రత్యేక నిధి కేటాయించాలని గడ్డం స్వామి డిమాండ్ చేశారు.ఈ పర్యటన కార్యక్రమంలో కొర్స రమణ,రాధా,నాగమణి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.