స్కూల్ యూనిఫాంలో సకాలంలో అందించాలి
– ఎంపీడీవో జమలారెడ్డి
నేటి గదర్, మే 25, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించే లోపు స్కూల్ యూనిఫాంలో సకాలంలో అందించాలని ఎంపీడీవో జమలారెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐకెపి సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా వారి వారి క్లస్టర్ పరిధిలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం నాగర్జున, సిసిలు తులసి, రాంబాబు, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 122