+91 95819 05907

నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై పోలీసులు కొరడా

★జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై పోలీసులు కొరడా

◆జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు , 03 కేసులు నమోదు

◆నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం,ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.*

◆జిల్లాలో ఈ సంవత్సరం 19 కేసులలో నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.*

◆విదేశాల్లో ఉద్యోగాల కోసం , ఉపాధి కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్*

నేటి గద్ధర్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా :

జిల్లాలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై శనివారం రోజున సాయంత్రం సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా టీమ్ లగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ తండ్రి హుస్సేన్ వయస్సు 53, రుద్రంగి మాండలం కేంద్రానికి చెందిన బొండు అంజయ్య , తండ్రి పోషయ్య వయస్సు 55.గంబిరావుపేట్ మండలం నర్మల గ్రామానికి చెందిన ఓరగంటి రాములు, తండ్రి సాయిలు వయస్సు 39 లపై 03 కేసులు నమోదు చేయడం జరిగిందని,నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈసందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఎజెంట్స్ విజిట్ వీసాల పై జిల్లాలో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేసి వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్పి ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకి పంపిస్తారు. అక్కడికి అప్పులు చేసి వెళ్లిన తరువాత కంపనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఎం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవడం లేదా అక్కడే ఏదో చిన్న చితక కూలి పని చేసుకోవడం వంటివి జరుగుతునాయని,అయితే ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలిసులకు పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు పై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు ఏజెంట్ పై కేసు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లాలో గత సంవత్సరం 43 కేసులు ,ఈ సంవత్సరం 19 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం,ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే సదరు ఏజెన్సీల రద్దు కు సిఫారసు చేయడం తో పాటు వారి ఫై పిడి యాక్ట్ పెట్టడం జరుగుతుందన్నారు.విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని,జిల్లాలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు గాను పోలీస్ శాఖ వారిని సంప్రదించవచ్చని సూచించారు.జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన, విదేశాలకు పంపిస్తా అని డబ్బులు తీసుకొని , పాస్పోర్ట్ తూసుకోని పంపకుండా మోసం చేసిన , నకిలీ గల్ఫ్ ఏజెంట్ల కి సంబంధించిన సమాచారం ఉంటే సమాచారం అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !