★భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల మంజూరు కు డిమాండ్
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
చర్ల మండల కేంద్రంలో ఆదివారం GSP వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతానికి గుండెకాయ లాంటి ప్రాంతంలో న్యాయ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్తో జూన్ 24న చలో హైదరాబాద్ ఇందిరాపార్కు ఎదుట మహా ధర్నా తలపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు .
షెడ్యూల్ ప్రాంతాలలో నివాసం ఉన్నటున ఎందరో ఆదివాసి విద్యార్థులు అనేక కారణాల పేదరికం సమస్యలతో పై సదువులకు వెళ్లలేని దుస్థితి కనబడుతుందని తద్వారా భద్రాచలం బీఈడీ కళాశాల తరహాలో భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను ఏర్పాటు చేస్తే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల విద్యార్థులు లా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని అన్నారు
వచ్చే జూన్ నెల 24న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా తలపెట్టనున్నామని యొక్క ధర్నాకు విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో బెండబోయిన శేఖర్ గొంది ధనరాజ్ సోడి అనిల్ ఇర్ప అరుణ్ గొంది లీలా ప్రసాద్ పాల్గొన్నారు.