నేటి గదర్, మే 26, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
సోంపల్లి గ్రామానికి చెందిన నడిపింటి రమేష్ అనే రైతుకు చెందిన గేదె విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన రమేష్ గేదె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామానికి సమీపంలో మేతకు శనివారం ఉదయం వెళ్లిన గేదె ఇంటింటికి తిరిగి రాకపోడంతో గ్రామంలో వెతికాడు. తారస పడకపోవడంతో మరుసటి రోజు ఆదివారం వెతుకుతుండగా ఓ రైతు పొలం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ కింద విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. సుమారు గేదె విలువ రూ 60వేలు ఉంటుందని రైతు తెలుపుతున్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గేదె మృతి విషయంపై విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు.
Post Views: 560