– పేదల రాజ్యం కోసమే సిపిఎం పార్టీ పనిచేస్తుంది
– సిపిఎం రాష్ట్ర సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు
నేటి గదర్, మే 26, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :
(అలవాల వంశీ 9052354516)
భారతదేశంలో సిపిఎం ది త్యాగాల చరిత్ర అని, కష్టాలను ఎదుర్కొన్న వాడే నిజమైన కమ్యూనిస్టు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు మండలం పగిడేరు పంచాయతీలో కుంజ కృష్ణకుమారి ప్రాంగణం లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల కార్యదర్శి కొడిశాల రాములు, ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా మచ్చ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ కార్యక్రమం విశిష్టత బోధించారు. దేశంలో మూడు రాష్ట్రాలలో 9 మంది ముఖ్యమంత్రులు పనిచేశారని పేదల సంక్షేమం కోసం సంక్షేమం కోసం తప్ప ఎవరి మీద ఎలాంటి మచ్చలేదని అన్నారు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాట ఫలితాలను ప్రజలకు అందించకుండా ప్రజలను దోపిడీ గురిచేసిందన్నారు. ఈ పది సంవత్సరాల కాలంలో బిజెపి, కాంగ్రెస్ కన్నా అధికంగా దోపిడి చేసిందన్నారు. బూర్జవా పార్టీలన్నీ కూడా ప్రజలను దోపిడీ చేయడం కోసమే పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామన్నారు. వీర తెలంగాణ విప్లవ పోరాటం మొదలుకొని దేశంలో ప్రజల పక్షాన అనేక త్యాగాల పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఎం ది అన్నారు. డబ్బులు పంచకుండా ఏ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ప్రజలను మోసం చేస్తూ ఈ దేశ సంపదను రాజకీయ పార్టీలు కొల్ల కోట్టి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాయన్నారు. స్వతంత్ర కాలం నుండి ఈనాటి వరకు దళితులు, ఆదివాసులు ఇతర పేదల బతుకులు మారలేదన్నారు. ఖర్చు పెరిగింది, శ్రమ దోపిడీ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రజల పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టుల పార్టీల వెనుకబడ్డాయని విమర్శలు కొంతకాలం మాత్రమే ఉంటాయన్నారు. మబ్బులు కమ్మిన సూర్యుడిలా ఈ దేశంలో కమ్యూనిస్టుల పోరాటాలు నిర్వహించబడతాయన్నారు. మధ్యాహ్నం క్లాసును ఉపాధ్యాయులుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ పార్టీ నిర్మాణం పని పద్ధతి వివరించారు. మార్క్సిజం అధ్యయనం ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల లెనిన్ బాబు, సత్రపల్లి సాంబశివరావు, ఉపతల నరసింహారావు, బొల్లం రాజు, నందం ఈశ్వరరావు, పిట్టల నాగమణి, పల్లపు నాగేశ్వరరావు, శాఖా కార్యదర్శులు పర్షిక పాపారావు, తాళ్లపల్లి ఉప్పలయ్య, టేకుల సత్యవతి, గనబోయిన శంకర్, కుంజా రాజు, కుంజా యుగంధర్, భూషణం, తోట పద్మ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.