– ఒకరు దుర్మరణం… ఒకరి పరిస్థితి విషమం
నేటి గదర్, మే 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
బంధువుల ఇంట్లో కర్మలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యుఒడికి చేరగా మరొకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టీనగర్ గ్రామంలోని కిన్నెరసాని బ్రిడ్జి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ మండలం గుడిపాడుకు చెందిన శెట్టిపల్లి నర్సింహారావు(18) తన స్నేహితుడు కణితి హర్షవర్ధన్ తో కలిసి ద్విచక్రవాహనంపై గుడిపాడు నుండి మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో కర్మల కార్యక్రమంలో పాల్గొనేందుకుద్విచక్రవాహనంపై వెళుతున్న క్రమంలో పినపాక పట్టీనగర్లోని కిన్నెరసాని బ్రిడ్జికి చేరుకోగానే భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న శెట్టిపల్లి నర్సింహారావు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా… స్నేహితుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ ను స్థానికుల సహాయంతో పాల్వంచ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్సై సుమన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.