నేటి గదర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం స్థానం నుంచి బీజేపీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఓటమి పాలయ్యారు. అయితే తనపై నమ్మకం ఉంచి, తనకు 120000 మెజారిటీ ఓట్లు వేసిన ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అని, గెలిచినా, ఓడినా ప్రజలతో ఉంటు, ప్రజల సమస్యల కోసం పాటుపడతనని తెలిపారు,ఈ రోజు ఖమ్మంలో గల తన క్యాంపు ఆఫీస్ లో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసి,ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించినా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ప్రజల తీర్పు ను గౌరవిస్తానని తెలిపారు.
Post Views: 55