నేటి గదర్,జూన్ 6 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
నీట్-2024 పరీక్షా ఫలితాల్లో కూసుమంచి మండల కేంద్రానికి చెందిన వడ్లమూడి ప్రకృతి ప్రతిభను చాటింది. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించింది. మొత్తంగా 720 మార్కులకు గాను 651 (98.75శాతం) వచ్చాయి. కూసుమంచి ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వడ్లమూడి వెంకటేశ్వర్లు, లోక్య తండాలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్న చావా స్వరూల ల కూతురు ప్రకృతి చిన్నతనం నుంచే చదువులో ప్రతిభను కనబరిచేది. పాఠశాల విద్య ఆరు నుంచి పదో తరగతి వరకు పాలేరు నవోదయ పాఠశాలలో కొనసాగింది. జన విజ్ఞాన వేదిక నిర్వహించిన పోటీ పరీక్షలలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆటల్లోకూడా ప్రతిభ చాటింది. కబడ్డీలో క్టస్టర్, జాతీయ స్థాయిలో పాల్గొని బహుమతులు అందుకుంది. ఎన్ సీసీ లో రాణించి అవార్డు అందుకుంది. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తిచేసింది. బైపీసీలో కూడా అత్యధిక మార్కులు సాధించింది. ప్రకృతిని ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, ఎంఈవో రామాచారి, మండల నోడల్ అధికారి రాయల వీరస్వామి,ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.