నేటి గదర్,జూన్ 6 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
కుసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ రామ సహాయం వెంకట్ రెడ్డి తల్లి రామ సహాయం పద్మమ్మ ఇటీవల కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం పోచారంలోని వారి స్వగ్రామానికి వెళ్లి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి పద్మమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. ఆయన వెంట కల్లూరు గూడెం సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు ,రావుల సురేష్ రెడ్డి ఉన్నారు.
Post Views: 345