★ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్.
నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
18వ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం లోకసభ స్థానంకు ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ని 4 లక్షల 60 వేల పై చిలుకు మెజార్టీతో భారీ విజయాన్ని అందించిన ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు, కాంగ్రెస్ అభిమానులకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వైరా నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా నాకు 36 వేల మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. దానికి రెండింతలు వైరా నియోజకవర్గం నుంచి రామ సహాయం రఘురాం రెడ్డి కి ఓట్లు వేసి భారీ విజయనందించారు.అందుకు కారణం అయినా ప్రతీ కార్యకర్తకు, కాంగ్రెస్ అభిమానులకు వైరా నియోజకవర్గం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతునన్ను అని అన్నారు.
Post Views: 33