జోరున వర్షంలో చికెన్ షాప్ లో దొంగలు..
– సీసీ కెమెరాలు ధ్వంసం
– సుమారు రూ.70 వేలు చోరీ
నేటి గదర్, జూన్ 07, భద్రాద్రి కొత్తగూడెం :
అర్ధరాత్రి చికెన్ షాప్ లో దొంగల పడి చోరీ చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గురువారం వెలుగు చూసింది. సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… బూర్గంపాడు మండల పరిధిలో సారపాక ప్రధాన సెంటర్ వద్ద ఉన్న వినయ్ చికెన్ షాప్ లో బుధవారం రాత్రి భీభత్సమైన వర్షం కురుస్తుండడంతో షాపులో పనిచేస్తున్న వర్కర్లు ఆరోజు షాప్ కౌంటర్ నగదును షాప్ లోనే ఉంచి హడావుడిగా షాప్ ని మూసేసి తాళాలు వేసి వెళ్ళిపోయారు. గురువారం ఉదయం షాపు వద్దకు వచ్చి చూడగా షాప్ లో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా చోరీకి పాల్పడ్డ వ్యక్తులు షాపు వెనక భాగంలో ఉన్న మెస్ ను కట్ చేసి, డోర్లు పగలగొట్టి షాప్ లోకి ప్రవేశించినప్పుడు తెలుస్తుంది. సీసీ కెమెరాల ధ్వంసం చేసి, కౌంటర్ ను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.70 వేలు మాయం చేసినట్లుగా సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలిసింది.