★మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దు…
★అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారం ఇవ్వండి…
★వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు.
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి వాజేడు,జూన్ 6:
కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న విప్లవ పార్టీలకు ఎవరూ సహకరించవద్దని వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగల గ్రామంలో గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రజలతో మాట్లాడుతూ,మావోయిస్టుల వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం లేదని,అందు వల్లనే ఎవరైనా అనుమానితులు,కొత్త వ్యక్తులు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లైతే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించాల్సిందిగా ఆయన కోరారు.అదే విధంగా మావోయిస్టు పోస్టర్స్ చూపించి ఆ పోస్టర్స్ ను ఊర్లో అంటించి అందులోని వారెవరైనా కనిపించినట్లైతే వెంటనే సమాచారం అందించాలని చెప్పారు.ఆ వ్యక్తుల వివరములు గోప్యంగా ఉంచి,వారికి తగిన బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ జవాన్లు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.