+91 95819 05907

మారుతి కాలేజీ విద్యార్థుల మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి:MMS

★MMS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు: మేకల లత మహాజన్.

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి భద్రాచలం జూన్ 6:

నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668

భద్రాచలంలోని ప్రైవేట్ మారుతి పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీల మరణాలపై ప్రభుత్వం స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని మరొక్క విద్యార్థినికి ఇలాంటి సంఘటనలు జరగ కుండా భద్రత కల్పించాలని మహాజన మహిళా సమైక్య (MMS) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మేకల లత మహాజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మారుతి కళాశాలలో చనిపోతున్న విద్యార్థుల మరణాల పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయని,కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వేధింపుల వల్లనే విద్యార్థినీలు చనిపోతున్నరనే బలమైన వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ అధికారులు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది పలు అనుమానాలకు దారితీస్తుందని మేకల లత మహాజన్ అనుమానం వ్యక్త పరిచారు. విద్యార్థినీలు చనిపోతే కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఆశ చూపించి డబ్బుతో మారుతి కళాశాల యాజమాన్యం మధ్యవర్తుల సహాయంతో అనారోగ్యం,ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ ప్రకారం తోటి విద్యార్థులతోనే అబద్ధాలు ఆడిస్తున్నారని అన్నారు.ప్రతి రోజు కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల వివక్షత కూడిన వేధింపులు,మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుందని, మారుతి కళాశాలపై సంబంధించిన ప్రభుత్వ అధికారులకు ఆర్థికంగా స్నేహ సంబంధాల వల్ల మారుతి కళాశాలపై ఎటువంటి చర్యలు నేటి వరకు తీసుకోకుండా యాజమాన్యాన్ని కాపాడడం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.పగిడిపల్లి కారుణ్య మృతి మరియు విద్యార్థినిల మరణాలకు కారణమైన కళాశాల యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,అనుమానాస్పద మరణాలపై సిట్టింగ్ జడ్జితో పూర్తి ఎంక్వయిరీ జరిపించాలని, మృతులకు కారణమైన మారుతి నర్సింగ్ కళాశాల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు,నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లని సమ్మక్క,ఉపాధ్యక్షురాలు కుంచెర్ల కుమారి,కొప్పుల నాగమణి మాదిగ,ఎస్కే సల్మా తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !