+91 95819 05907

ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు నిర్వహించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి :AISF

నేటి గధర్ న్యూస్ ,జూలూరుపాడు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ముందే మరమ్మతులు మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి, గుగులోత్ వంశీ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు భయానకంగా ఉన్నాయని,
తరగతు గదులలో కిటికీలకు సరైన డోర్లు లేవని అన్నారు. పాఠశాలలకు చుట్టూ మద్యం సీసాలతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందన్నారు. నీటి కుళాయిలు విరిగి, శిథిలావస్థకు చేరిందని,చెత్తాచెదారాలతో అపరిశుభ్రంగా ఉందని, పాఠశాలలో నీటి సమస్య అతి ప్రధాన సమస్యగా ఉందని,తరగతి గదులలో ఉన్న అనేక బెంచ్ లు విరిగి, ఊడిపోయి ఉన్నాయని, తరగతి గదులలో పై పెచ్చులు ఊడుతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ ను కాకుండా దీర్ఘకాలిక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
జూన్ 11వరకు వేసవి సెలవులు ఉన్నందున.. వేసవి సెలవులు పూర్తయ్యే లోగా ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మత్తులను పూర్తి చేస్తే 2024 విద్య సంవత్సర విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులను చేయవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి, అంశాల వారీగా ఎంపిక చేసి ఆయా పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ పనులన్నింటినీ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారానే జరిగేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ఆధీనంలో ఉండే జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధుల్లో నుంచి పాఠశాలల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !