నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 6:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఐలమ్మ నగర్ నందు వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గ సహిత పెద్దమ్మతల్లి ఆలయం నందు ఈరోజు పంచగ్రహ కూటమి మరియు శనేశ్వర జయంతి అమావాస్య సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయం నందు శ్రీ ప్రత్యంగిరా దేవి హోమాన్ని బ్రహ్మశ్రీ తుమోజు శ్రీనివాస ఆచార్యులు చేత.ఆలయ ప్రధాన అర్చకులు యోగేంద్ర ఆచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంత విశ్వంలో అనేక మార్పులు చేర్పులు జరగటం గ్రహ సంచారము జరగడం అలానే ఈసారి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి ఏర్పడడంతో ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు చోటుచేసుకుని ఉన్నాయి.గ్రహశాంతి కొరకు ప్రజలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో తొలదూగాలని.
ప్రపంచంలో శాంతి నెలకోవాలని
ఈ భూ ప్రపంచంలో పాడిపంట, గొడ్డు,గోదా,సంపూర్తిగా అభివృద్ధి చెందాలని తలచిలోక కళ్యాణార్ధం శ్రీ ప్రత్యంగిరా దేవి హోమాన్ని వేద పండితులు, బ్రహ్మశ్రీ తూమోజు శ్రీనివాస ఆచార్యులు కళ్యాణ్ కుమార్,యోగేంద్ర గారు.దేవేంద్ర ఆచార్యులచే ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి జగన్ మత కృపకు పాత్రులు అయినారు.ప్రత్యేకంగా ఈ ప్రత్యంగి దేవి హోమాన్ని ఎండు మిరపకాయలతో ఆవాలతో మిరియాలతో హోమ ద్రవ్యాలతో ఘనంగా నిర్వహించడం ప్రత్యేకత సంచరించుకుంది.