.
★IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు.
ఆర్ మధుసూదన్ రెడ్డి
షేక్ యాకూబ్ షావలి,
నేటి గద్ధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగు ఇల్లందు, టేకులపల్లి, గుండాల, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు ఐ ఎఫ్ టి యు ఏరియా మహాసభలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు
ఆర్. మధుసూదన్ రెడ్డి,
యాకుబ్ షావలి కార్మిక వర్గాన్ని కోరారు. గురువారం ఆర్. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన కొత్తగూడెం ఆఫీస్ లో జరిగిన iftu జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడవలసిన అవసరం ఉందన్నారు. అందుకు బలమైన కార్మిక ఉద్యమాలను నిర్మించవలసిన అవసరం ఉందన్నారు. బలమైన కార్మిక ఉద్యమాల నిర్మాణం కొరకు ఐ ఎఫ్ టి యు ను మరింత బలోపేతం చేయుట కొరకు ఈనెల 9వ తారీఖున ఇల్లందు ఏరియా మహాసభ, 10న కొత్తగూడెం ఏరియా మహాసభ, 11 న టేకులపల్లి ఏరియా మహాసభ, 13న గుండాల ఏరియా మహాసభ, 15న పాల్వంచ ఏరియా మహాసభ, 16న మణుగూరు ఏరియా మహాసభ, 16 తరువాత భద్రాచలం ఏరియా మహాసభ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు.
ఈ సమావేశంలో గోనెల. రమేష్, వై .గోపాలరావు,పాయం. వెంకన్న, ఎం.చంద్రశేఖర్ ,బి. మల్సూర్, మల్లెల. వెంకటేశ్వర్లు, సుందర్,శాంతయ్య, రాజశేఖర్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.