నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలో మహబూబాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన పొరిక బలరాం నాయక్ గురువారం సిఎం రేవంత్ రెడ్డినీ హైద్రాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేసారు. మంచి మెజారిటీతో విజయం సాధించిన బలరాం నాయక్ ను సిఎం రేవంత్ రెడ్డి అభినందించారు… అందరూ ఇలాగే కలిసి పని చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ,ప్రజలకు సంక్షేమ పథకాలను అందేలా చూడాలి సూచించారు. మంత్రి సీతక్క,ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు,కోరం కనకయ్య,తెల్లం వెంకట్రావు ఉన్నారు..
Post Views: 158