★మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు
గద్దల రమేష్
నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి(ఖమ్మం):
మాదిగ జేఏసీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు వేల్పల జోషి అధ్యక్షతన మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా మాదిగ జేఏసీ క్ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్ పాల్గొని మాట్లాడుతూ, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి నేడు
పాల్వంచ మండల పరిధిలోని నాగారం గ్రామంలో నిర్వహిస్తున్న మాదిగల జనసభ కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమానికి మాదిగ జేఏసీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ పట్టణ అధ్యక్షులు వెలుపల జోషి,మాదిగ జేఏసీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ కాంపాటి శివ,మాదిగ జేఏసి వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్ మధు,మాదిగ జేఏసీ నియోజకవర్గం ఉప అధ్యక్షులు కిన్నెర లక్ష్మణ్,జేఏసీ నాయకులు గద్దల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.