+91 95819 05907

ఇళ్లు… ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాదే..:మంత్రి పొంగులేటి

ఎంపీగా రామసహాయం రఘురాం రెడ్డినీ గతంలో ఎన్నడూ లేని
మెజారిటీతో గెలిపించారు..

నీకోసమే పని చేస్తా..మీకు అండగా నిలబడతా..

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేటి గదర్,జూన్ 8 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

అర్హులైన పేదలందరికీ మొదటి విడతలో ఇళ్లు….రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.శనివారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా నాయకన్ గూడెం, భగత్ వీడు తండా, మంగళి తండా, ఈశ్వర మదారం, రాజుపేట బజార్, రాజు పేట, గోరిలపాడు తండా, హిరామాన్ తండా, పెరిక సింగారం, జక్కేపల్లి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ, మల్లేపల్లి, గట్టు సింగారం, గంగబండ తండా, లింగారం తండా, కోక్యా తండా, లోక్యా తండా, నేలపట్ల, అగ్రహారం, మునిగేపల్లి గ్రామాలలోపర్యటించారు. పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఇన్ని సంవత్సరాల్లో ఏ సభ్యుడికి రాని మెజారిటీ రఘురాం రెడ్డి కి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్ని పరిష్కరిస్తానన్ని హామీ ఇచ్చారు. గడిచిన పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రేషన్ కార్డు,ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలేరు తన సొంత ఇళ్లు కాబట్టి అక్కడి ప్రజలు ఇచ్చిన పదవితో వారందరి కోరికలు తీరుస్తానన్నారు.
రాబోయే మూడు సంవత్సరాల్లోపే పాలేరులోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారందరికీ తీపి కబురు అందుతుందని తెలిపారు.
ఉచిత కరెంటు కోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి వాటిలో పేదలకు ఇళ్ళు నిర్మాణం చేస్తామని తెలిపారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి తో పాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !