వైసీపీ దుర్మార్గపు పాలనకు స్వస్తి పలికిన ప్రజలు…
ఏపీలో నేటి నుంచి ప్రజా సుపరిపాలన ప్రారంభం…
మణుగూరు మండల టిడిపిలో నూతన ఉత్సాహం…
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 12:
నైనారపు నాగేశ్వరరావు ✍️
మణుగూరు మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి చలపతిరావు అధ్వర్యంలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్ తినిపించుకొని,అనాధ వృద్ధ ఆశ్రమంలో భోజనాలు పంపిణీ చేసి అంబేద్కర్ కూడలి వద్ద బాణసంచా కాల్చి,ఆట పాటలతో సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సాకారానికి శుభ సూచకం అన్నారు.వైసీపీ దుర్మార్గపు పాలనకు స్వస్తి పలికిన ప్రజలకు ఈ రోజు నుంచి అన్నీ మంచి రోజులే అని చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని కోరారు.ఏపీలో టీడీపీ గెలుపుతో అదే ఉత్సాహంతో తెలంగాణ టీడీపీలో కూడా నూతన ఉత్సాహంలో క్యాడర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి టిడిపి శ్రేణులు సిద్ధంగా ఉన్నారని మండలంలో కూడా టిడిపి బలోపేతానికై ప్రత్యేక ప్రణాళిక తో కార్యాచరణ సిద్ధం చేశామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బచ్చల భారతి మండల అధ్యక్షుడు దొడ్డి కృష్ణ , నాయకులు యార్లగడ్డ రాజా, పూర్ణ, మానుకొండ ఉమాకర్, మానుకొండ రఘురాం,చిర్ర రవికుమార్,చావా రామారావు, బచ్చల సుమేష్,అబ్దుల్ నబీ, మద్దెల భద్రయ్య,కే సత్యనారాయణ,వెంకటేశ్వర్లు, హరికృష్ణ,సైదులు,వెంకట్రావు, నరసింహారావు,ఈలియకత్, మల్లికార్జున్,ఎన్ వి ఆర్ చౌదరి, మహిళా నేతలు ఖముర్నిషా బేగం,చావా శ్రీదేవి,రమ, విజయలక్ష్మి కార్యాలయం ఇన్చార్జ్ మల్లయ్య, లక్ష్మీనారాయణ,టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









