నేటి గదర్ న్యూస్, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ సింగరేణి కాలనీకి వెళ్లే రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో నలుగురు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుకోవడం జరిగింది. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ బైకర్స్ మాత్రం అతివేగంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాల మూలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు అంకెల సంఖ్యలో మృతి చెందడమో… గాయాల పాలైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్ తీసుకుంటే గాని వీరిలో మార్పు వచ్చే దాఖలాలు కనపడలేదు. యువత చేష్టల మూలంగా అటు పోలీస్ శాఖకు చెడు పేరు రావడంతో పాటు… ఆయా యువకుల తల్లిదండ్రులకు తీరని కడపు కోత మిగులుతుంది.
Post Views: 1,428