+91 95819 05907

డ్వాక్రా ఋ ణం తీసుకున్న మహిళ చనిపోతే బాకీ మొత్తం మాఫీ

★మహిళా సంఘాల సభ్యులకు లోన్ బీమా

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్ , జూన్ 17:

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆపన్న హస్తం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉండి లోన్ తీసుకున్న మహిళ ఏదైనా కారణంతో చనిపోతే.. ఆ లోను మొత్తం మాఫీ అయ్యేలా వారి పేరిట బీమా చేయించాలని నిర్ణయించింది. మహిళలపై భారం పడకుండా ఈ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించేందుకు. ఇప్పటికే రూ.50.41 కోట్లు మంజూరు చేసింది. అంతేగాక, ఈ బీమా ప్రయోజనాలను ఈ ఏడాది మార్చి 14 నుంచే వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. బ్యాంకు లింకేజీ లోన్లతోపాటు స్త్రీనిధి లోన్లకు కూడా ఈ లోన్ బీమా వర్తించనుంది. క్షేత్ర స్థాయిలో బీమా క్లెయిమ్ చేసే విధానంపై అప్పటికే సెర్చ్, మెప్మా సిబ్బందికి గైడ్ లైన్స్ అందాయి.
64.35 లక్షల మంది మహిళలకు లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్) పరిధిలోని 4,30,358 స్వయం సహాయక సంఘాల్లో 46.46 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉండగా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ( మెప్మా) పరిధిలోని 1.78 లక్షల గ్రూపుల్లో కలిపి 17.89 లక్షల మంది సభ్యులున్నారు. వీరందరికి లోన్ బీమా/ప్రమాద బీమా/ స్త్రీనిధి సురక్ష బీమా వర్తించనుంది . చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మహిళా గ్రూపులకు బ్యాంకులతోపాటు స్త్రీనిధి రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రుణాలు తీసుకున్నవారిలో కొందరు మహిళలు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు వారి వాటా ధనం చెల్లించడం సమస్యగా మారుతోంది. గ్రూపుగా తీసుకున్న లోన్ ను గ్రూపుగానే చెల్లించాల్సి ఉంటుంది. మృతురాలి కుటుంబ సభ్యులు లోన్ కిస్తీ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో గ్రూపులోని మిగతా సభ్యులపై ఆ భారం పడుతోంది. చనిపోయిన మహిళ వాటా ధనం తీసేసి తమ లోన్ కిస్తీని చెల్లించేందుకు మిగతా సభ్యులు వెళ్తే బ్యాంకు
ఆఫీసర్లు తీసుకోవడం లేదు. దీంతో గ్రూప్ మొత్తం కిస్తీలు చెల్లించడం ఆపేయడంతో అ గ్రూప్ఎన్ పీఏ జాబితాలోకి వెళ్తుంది. ఈ సమస్య నుంచి మహిళల ను బయటపడేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం లోన్ బీమా స్క్రీమ్ను అమల్లోకి తెచ్చింది.

రూ.2 లక్షల వరకు రుణ మాఫీ… రూ.10 లక్షలు ప్రమాద బీమా..

ఈ సీమ్లో భాగంగా లోన్ తీసుకున్న మహిళలు ఎవరైనా ఏ కారణంతో చనిపోయినా వారు తీసు కున్న లోన్ రూ.2 లక్షల వరకు మాఫీ కానుంది. ప్రస్తుతం గరిష్టంగా ఒక్కో మహిళకు బస్తున్న లోని రూ.2 లక్షలు మాత్రమే. దీంతో మిగతా సభ్యులు తమ కిస్తీలు చెల్లిస్తే సరిపోతుంది. చనిపోయిన మహిళ బ్యాంకు లింకేజీరుణం, స్త్రీనిధి లోన్ రెండూ తీసుకుని ఉంటే మాత్రం ఒక లోన్ మాత్రమే మాఫీ కానుంది. అలాగే ప్రమాదవశాత్తూ మహిళా గ్రూపు సభ్యురాలు చనిపోతే యాక్సిడెంటల్ బీమా కిందరూ.10 లక్షలు:
మృతురాలి కుటుంబానికి చెల్లించనున్నారు.
మహిళలకు బీమాను ఎత్తేసిన బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలంతా అభయ హస్తం స్కీమ్లో ఉండేవారు. వారికి ఆమ్ ఆద్మీ బీమా యోజన వర్తించేది. ఈ పథకంలో ఉన్న మహిళ లేదా ఆమె భర్త ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.75 వేలు, సహజ మరణమైతే రూ.30 వేల పరిహారం ఇచ్చేవారు. అంత్యక్రియలకు మరో రూ.5 వేలు చెల్లించేవారు. సభ్యుల పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు రూ.1,200 స్కాలర్ షిప్ కూడా అందించేవారు. కానీ, బీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దు చేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు గానీ, వారి భర్తలు గానీ మరణి స్తే పరిహారం అందలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లోన్ బీమాను అమలు చేయడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 14

Read More »

 Don't Miss this News !