28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు…
ఉత్తర్వులు జారీ చేసిన :సిఎస్
శాంతి కుమారి.
నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 17:
నైనారపు నాగేశ్వరరావు ✍️
తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అన్ని శాఖల్లో భారీ బదిలీలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం భారీగా ఐఏఎస్ ల బదిలీలు కాగా తాజాగా ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రెవెన్యూ పోలీస్ తో పాటు మరిన్ని శాఖలో బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
Post Views: 542